ముందస్తు ఎన్నికల కోసం సీఎం కేసీఆర్‌ కొత్త వ్యూహం..?

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ముందస్తు ఎన్నికల వేడి నడుస్తోంది. గత కొంత కాలంగా సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతూ వస్తున్నారు. మరోవైపు ఆ దిశగా నేతలను ఎన్నికల కోసం సన్నద్ధం చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని కేసీఆర్‌ వారిని ఆదేశించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ముందస్తు ఎన్నికల విషయమై మరో అంశం తాజాగా తెలుస్తోంది.

సీఎం కేసీఆర్‌ మాటిమాటికీ ఢిల్లీ వెళ్లడం వెనుక కేవలం కేంద్రంతో పనులు చేయించుకోవడమే కాక, ముందస్తు ఎన్నికలపై ఎన్‌డీఏ పెద్దలతో మాట్లాడుతున్నట్లు తెలిసింది. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం… సీఎం కేసీఆర్‌ బీజేపీ అధిష్టానం ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అదేమిటంటే…

ముందు మాకు అసెంబ్లీ ఎన్నికల్లో సహకారం అందించండి.. ఆ తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మేము మీకు సహకారం అందిస్తాం.. అని ఓ ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌ బీజేపీ పెద్దల ముందు ఉంచినట్లు సమాచారం. అయితే దీనికి బీజేపీ అధిష్టానం కూడా అంగీకరించినట్లు తెలిసింది. ఇక ఇదే నిజమైతే గనక వచ్చే అక్టోబర్‌ నెలలోనే సీఎం కేసీఆర్‌ తన ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చని తెలుస్తోంది. అలా జరిగితే అనుకున్న సమయం కన్నా ముందు గానే తెలంగాణలో ఎన్నికలు రావచ్చని సమాచారం. మరి ఈ విషయం నిజమవుతుందా, లేదా అనేది వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news