MANALOKAM
భారత దాయాది దేశమైన పాకిస్తాన్ ఆగడాలు సరిహద్దుల్లో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయన్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దాయాది పాకిస్థాన్ దేశం మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ… తరచూ సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇదే తరహా వ్యవహరిస్తూ ఉంటుంది పాకిస్తాన్. అందుకే ఎప్పటికప్పుడు పాక్ భారత్ సరిహద్దులో అప్రమత్తంగా ఉండే భారత సైన్యం… పాకిస్తాన్ దాడులను తిప్పి కొడుతూ ఉంటుంది.
అయితే 17 ఏళ్లలో మొదటిసారి సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎక్కువసార్లు ఉల్లంఘించి దాడులకు పాల్పడింది. ఈ జనవరి నుంచి సెప్టెంబర్ 7 వరకు దాదాపు తొమ్మిది నెలల్లో 3186 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలిపింది. అయితే ప్రతిసారి భారత సైన్యం పాకిస్తాన్ ను సమర్ధవంతంగా తిప్పికొట్టింది అనే విషయాన్ని కూడా తెలిపింది కేంద్రం.