ఇటీవలే పాకిస్థాన్ లోని లాహోర్ లో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ఈ అత్యాచార ఘటన ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగసాయి. నిందితులు అందరినీ వెంటనే కఠినంగా శిక్షించాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసనలు ధర్నాలు కూడా చేపట్టారు. మరోసారి ఆడపిల్లలపై అత్యాచారం చేయాలి అంటే భయపడేంతలా శిక్ష విధించాలి అని డిమాండ్ చేశారు పాకిస్తాన్ ప్రజానీకం.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ అత్యాచార ఘటన గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార కేసులో నిందితునిగా తేలిన వారిని అందరిముందే దారుణంగా ఉరితీయాలి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇలా ఉరితీయడం కారణంగా దేశం అపఖ్యాతిని మూటగట్టుకునే అవకాశం ఉన్నందున.. అత్యాచార నిందితులకు ఔషధాల సాయంతో పురుషత్వం తొలగించాలి అంటూ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి పోయాయి