వీడియో: ఎన్టీఆర్ పాటకి జపాన్ అభిమానుల డాన్సులు..

-

జపాన్ లో తెలుగు సినిమాలకి అభిమానులు చాలామందే ఉన్నారు. బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు ప్రభాస్ కి అభిమానులు కూడా ఏర్పడ్డారు. ఒక్క ప్రభాస్ కే కాదు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆ అభిమానాన్ని జపాన్ అభిమానులు, ఎన్టీఆర్ సినిమాల్లోని పాటలకి కవర్ సాంగ్స్ చేయడం ద్వారా తెలుపుతున్నారు. భార్యా భర్తలిద్దరూ ఎన్టీఆర్ పాటలకి స్టెప్పులేసే వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఎన్టీఆర్ స్టెప్పులని అనుకరించడమే కాదు, కాస్ట్యూమ్స్ విషయంలో పాటకి మ్యాచ్ అయ్యేలా చూసుకున్నారు. మణిశర్మ సంగీతం అందించిన వయస్సునామీ పాటలోని స్టెప్పులని వేస్తూ, దానికి తమ క్రియేటివిటీతో కొంచెం హాస్యాన్ని ఆపాదించారు. ఈ పాట మొత్తం ఇంట్లో పని చేస్తున్నట్టుగా, తుడవడం, కడగడం వంటివి చేస్తూనే స్టెప్పులేసారు. అటు ఎన్టీఆర్ స్టెప్పులని మిస్ కానీకుండా, ఇటు ఇంట్లో పని చేస్తున్నట్టుగా చాలా క్రియేటివ్ గా చేసారు. కవర్ సాంగ్ కోసం ఇంతలా కష్టపడ్డారంటే వారు ఎన్టీఆర్ ని ఎంతగా అభిమానుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో వీరిద్దరూ కలిసి సింహాద్రి సినిమాలోని చీమ చీమ అనే పాటకి డాన్స్ కవర్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news