షాకింగ్ : ఒక్కసారిగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు..!

-

గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నిన్న అమాంతం పెరిగిపోయాయి. అలాగే ఇవాళ కూడా కాస్త పైకి కదిలాయి. పెరిగిన బంగారం ధరలతో పసిడి ప్రియులు ఖంగుతిన్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర కూడా భారీగానే పెరిగింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 490 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 54,020 కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల ధర రూ. 450 పెరగడంతో రూ. 49,520 కు చేరుకుంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా ప్రయాణించింది. కేజీ వెండి ధర రూ. 1200 పెరిగింది.

gold

దీంతో ధర రూ. 69,500 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 500 మేర పెరగడంతో రూ. 55,040 కి చేరుకుంది. అలాగే రూ. 460 పెరుగుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,460 కి చేరుకుంది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం ధర ఔన్స్‌ కు 1962 డాలర్లకు చేరగా. వెండి ధర ఔన్స్‌ కు 27.37 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news