జనవరి 27న చిన్న‌మ్మ విడుదల !

అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో నాలుగేళ్ల శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె విడుదల విషయంగా కొంత కాలంగా రక రకాల ప్రచారాలు సాగుతున్నాయి.

ముందుగానే ఆమె విడుదల అవుతారన్న చర్చ జోరుగానే సాగినా, అందుకు తగ్గ దాఖలాలు కనిపించలేదు. అలాగే, శిక్షా కాలం ముగిసినా, జైలులో లగ్జరీ వ్యవహారం ఆమె మెడకు చుట్టుకోవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇవన్నీ ఊహాజనితాలే అని పేర్కొనే రీతిలో శిక్షా కాలం ముగియగానే చిన్నమ్మ జయలలిత జైలు నుంచి బయటకు రావడం ఖాయం అవుతోంది. ఇందుకు తగ్గ వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది.