అల్లు అర్జున్‌ పై కేసు నమోదు.. ‘పుష్ప’ టీంకి షాక్..!

-

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ‘పుష్ప’. అయితే ప్రస్తుతం ఈ సినిమా టీంపై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‎లో కేసు నమోదైంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే బన్నీ ఫ్యామిలీతో ఆదిలాబాద్‌ చేరుకుని కుంతల జలపాతంను సందర్శించారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం కుంటాల జలపాతం సందర్శించేందుకు అనుమతులు లేవని, ఆ సినిమా బృందానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తూ.. సమాచార హక్కు చట్టం కార్యకర్త దేవులపల్లి కార్తీక్ మానవ హక్కుల సంఘం కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొవిడ్ నిబంధనల ప్రకారం అల్లు అర్జున్‎తో పాటు మిగతా బృందంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపోతే ఈ నెల 13 న అల్లు అర్జున్‌ కుంతల జలపాతంను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడి నుండి మహారాష్ట్రకు చేరుకున్న బన్నీ తిప్పేశ్వర్‌ అభయారణ్యంలో పర్యటించారు. ప్రస్తుతం బన్నీ పర్యటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news