గుడ్ న్యూస్ : మళ్ళీ పడిపోయిన బంగారం, వెండి ధరలు..!

-

గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. తగ్గిన  బంగారం ధరల చూసి పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర కూడా బాగానే తగ్గింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 70 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53950 కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 70 తగ్గడంతో రూ. 49,450 కు చేరుకుంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా ప్రయాణించింది.

gold

కేజీ వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో ధర రూ. 69,000 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 60 మేర తగ్గడంతో రూ. 54,980 కి చేరుకుంది. అలాగే రూ. 60 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,400 కి చేరుకుంది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం ధర ఔన్స్‌ కు 1965 డాలర్లకు చేరగా. వెండి ధర ఔన్స్‌ కు 27.32 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news