పుట్టిన రోజు నాడు కూడా మోడీని వదలని రాహుల్…!

-

ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అన్ని దేశాల అధినేతలతో పాటుగా మన దేశంలో ఉన్న విపక్ష నేతలు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ సందర్భంగా మోడీ చేసిన సేవలను గుర్తు చేస్తూ విష్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి మాత్రం కాస్త ఘాటుగా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసారు. ఆర్థిక సంక్షోభం మధ్య… భారతదేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత రేటుపై ఆయన విమర్శలు చేసారు.

కేంద్రంపైఆయన విరుచుకు పడ్డారు. ఒక ట్వీట్‌ లో రాహుల్ గాంధీ… “భారీ నిరుద్యోగం… యువతను ఈ రోజు నేషనల్ అన్ ఎంప్లాయిమెంట్ డే అని పిలవవలసి వచ్చింది. ఉపాధి అనేది ఒక గౌరవం. ఎంతకాలం ప్రభుత్వం దీనిని తిరస్కరిస్తుంది?” అని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా ప్రధాని మోడిని అవమానించారు. ఆయన ఒక కోతితో పోల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news