ఆడవారు ప్రతినెలా ఎదుర్కొనే అతిపెద్ద సమస్య పీరియడ్స్. ఈ సమయంలో కడుపు నొప్పి, వికారం, అధిక రక్తస్రావం వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొంచెం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చు. మన ఇంట్లో పెద్దవాళ్ళు అయితే నెలసరి సమయంలో పెరుగును తినకూడదు అని చెప్తూ ఉంటారు. తినడం వల్ల ఏం జరుగుతుంది? అసలు ఈ సమయంలో పెరుగు తినవచ్చా లేదా అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. అంతే కాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల నొప్పిని ఉంచుకోవచ్చునో తెలుసుకుందాం.
నెలసరి సమయంలో నీటితో నిండిన పండ్లు అంటే పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లను తీసుకోవడం ద్వారా చక్కెరలను తీసుకోకుండా మీ చక్కెర కోరికలను అరికట్టడమే కాకుండా, డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
నెలసరి సమయంలో రక్తస్రావం అధికంగా ఉండటం వల్ల అధిక మొత్తంలో ఐరన్ కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆకుకూరలను తీసుకోవడం ద్వారా ముఖ్యంగా పాలకూర, బచ్చల కూర వంటివాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా శరీరం కోల్పోయిన మెగ్నీషియంను తిరిగి పొందవచ్చు. మెగ్నీషియంని కోల్పోవడం వల్ల మన శరీరంలో అలసట, శారీరక నొప్పి దారి తీస్తుంది.
అధిక మొత్తంలో నీరు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. అయితే నెలసరి సమయంలో ఆ నీటిని కొద్ది మొత్తంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పి వంటి వాటి నుండి హైడ్రేట్ చేస్తుంది.
చాలామంది నెలసరి సమయంలో పెరుగు తినకూడదా అని చెప్తూ ఉంటారు. కానీ నెలసరి సమయంలో ఇటువంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండేవారు పెరుగు వంటి ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా, యోనిలో ఉండే మంచి బ్యాక్టీరియాను పోషించి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా పెరుగులో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఇతరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.