రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఎంపీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా డిప్యూటీ ఛైర్మన్ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిందే. రాజ్యసభలో ఆదివారం విపక్ష సభ్యుల దురుసు ప్రవర్తనపై ఉపాధ్యక్షుడు హరివంశ్ రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా చేశారు. 4పేజీల లేఖ ద్వారా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే ఈరోజు శరద్ పవార్ కూడా ఆ ఎనిమిది మంది ఎంపీలని సస్పెండ్ చేసినందుకు నిరాహార దీక్షకు దిగుతున్నారు.
ఇక వ్యవసాయ బిల్లులపై పునరాలోచించేవరకు సభలోకి వచ్చేది లేదని రాజ్యసభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. రాజ్యసభ నుంచి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ , తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసిన వారిలో ఉన్నారు. 8 మంది సభ్యుల పై సస్పెన్షన్ ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్కామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.