అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన పోకో ఎక్స్‌3 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర త‌క్కువే..!

-

మొబైల్స్ త‌యారీదారు పోకో నూత‌నంగా పోకో ఎక్స్‌3 స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఎక్స్ సిరీస్‌లో పోకో నుంచి వ‌చ్చిన లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు వైపు 20 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న పంచ్ హోల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ డిస్‌ప్లే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల గేమ్స్‌ను స్మూత్‌గా ఆడుకోవ‌చ్చు. పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 732జి ప్రాసెస‌ర్ ను అమ‌ర్చారు. 8జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది. ఇందులో లిక్విడ్‌ కూలింగ్ ప్ల‌స్ టెక్నాల‌జీని ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఫోన్ ఎక్కువ‌గా హీట్ అవ్వ‌దు.

poco x3 smart phone launched in india

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ల‌భిస్తుంది. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 13 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్స‌ల్ పోర్ట్రెయిట్ షాట్స్ కెమెరాలు ఉన్నాయి. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంది. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్ కేవ‌లం 30 నిమిషాల్లోనే 0 నుంచి 60 శాతం చార్జింగ్ పూర్త‌వుతుంది. అలాగే 86 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ పూర్త‌వుతుంది.

పోకో ఎక్స్‌3 స్పెసిఫికేష‌న్లు…

* 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 1080 × 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 732జి ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
* 64, 13, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

పోకో ఎక్స్ 3 స్మార్ట్ ఫోన్ షాడో గ్రే, కోబాల్ట్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.16,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.18,499గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్‌ను సెప్టెంబ‌ర్ 29వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తారు. దీనికి యాంటీ బాక్టీరియ‌ల్ కేస్‌, స్క్రీన్ ప్రొటెక్ట‌ర్‌ల‌ను ఉచితంగా అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news