16 నెలల్లో అమరావతి భూములపై వేసిన సబ్ కమిటీ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించారు. 16 నెలల్లో ఏపీ ప్రభుత్వం ఏమి చేసిందో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. నెలకు 3లక్షలు జీతం తీసుకుంటున్న సజ్జల ప్రభుత్వానికి ఏమైనా పనికి వచ్చే ఒక సలహా ఇచ్చారా? అని నిలదీశారు. గత ప్రభుత్వంలో 6లక్షల కోట్ల అవినీతి అని ఢిల్లీ నుండి గల్లీ వరకు తిరిగి ఏమి తేల్చారు? అని ఆయన ప్రశ్నించారు.
అమరావతి లో భూములు కొనకోడదు అని చట్టంలో ఏమైనా ఉందా? అన్నారు. పదే పదే అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చట్టంలో అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం లేదని పేర్కొన్నారు. 75వేల ఎకరాల భూమి విశాఖలో వన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని మండిపడ్డారు. అమరావతి భూములపై… విశాఖలో జరిగిన వన్ సైడ్ ట్రేడింగ్ పై దమ్ము ఉంటే సీబీఐ విచారణ జరపాలని ఆయన సవాల్ చేసారు. అమరావతి లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అని కాబినెట్ సబ్ కమిటితేల్చింది..అందుకే ఇప్పుడు సీబీఐ విచారణ అంటున్నారని అన్నారు.