బ్రేకింగ్ : భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్..ముగ్గురు మావోయిస్టుల మృతి !

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు రెండు చోట్లా ఎదురు కాల్పులు జరుగగా ఈ రెండు ఘటనలలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.చర్ల మండలం చెన్నపురం వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందగా మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. కొద్ది సేపటి క్రితం అంటే ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలం నుంచి 8 mm రైఫైల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అయితే నిజానికి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పాల్వంచ మండలంలో కాల్పులు జరిగాయని నక్సల్స్ పారిపోయారని పోలీసులు ప్రకటన జారీ చేశారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ కు సమీపంలోనే జరిగింది. అక్కడ ఒక ఎస్బిబిఎల్ గన్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఆ తరువాత ఏడు గంటలకి చర్ల మండలం చిన్నాపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు మావోయిస్టులను పోలీసులు చెబుతున్నారు . ఈ ఎన్కౌంటర్ నుంచి పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు

Read more RELATED
Recommended to you

Latest news