బ్రేకింగ్ : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కేటీఆర్

-

దుర్గం చెరువు పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి తో పాటూ, రోడ్ నెoబర్ 45లో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఫ్లై ఓవర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్,  మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు. 184 కోట్లతో ఆసియా లోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా ఇది రికార్డులకి ఎక్కింది. ఈ కేబుల్ బ్రిడ్జితో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను ఈ బ్రిడ్జ్ కు కలుపుతూ నిర్మించిన ఫ్లై ఓవర్ ను కూడా మంత్రులు ప్రారంభించారు. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఫ్లై ఓవర్ కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్ వేగా నామకరణం కూడా చేశారు.

184 కోట్ల రూపాయల వ్యయంతో 754.38 మీట‌ర్ల పొడవుగ‌ల బ్రిడ్జి నిర్మాణపనులు పూర్తి చేశారు బల్దియా ఇంజనీరింగ్ అధికారులు. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీట‌ర్ల ఎత్తులో వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 13 ఫౌండేష‌న్లు ఏర్పాటు చేశారు. స్టే-కేబుళ్లను ఆస్ట్రియా నుండి ప్రత్యేకంగా తెప్పించారు. దుర్గం చెరువు పరిసరాల్లో పర్యావరణం దెబ్బతినకుండా కేవలం 2 ఫిల్లర సహాయంతో 735 మీటర్ల పొడపున్న తీగల వంతెనను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. 8 దేశాల ఇంజనీర్లు దీని నిర్మాణంలో పాలు పంచుకున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news