బ్రేకింగ్ : తెలంగాణాలో రేపటి నుండి అన్ని పార్క్ లు ఓపెన్

-

రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి పార్కులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ), పరిధిలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ పరిధిలోని పార్కులు సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్ఎండిఎ ప్రకటించింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో లుంబినీ పార్క్ ఎన్టీఆర్ గార్డెన్ సంజీవయ్య పార్క్ తదితర పార్కులు మూసి వేసిన సంగతి తెలిసిందే.

శనివారం నుంచి హెచ్ఎండిఎ, బిపిపి పార్కులు ఓపెన్ అవుతాయని వెల్లడించింది. ఇక అలానే రేపటి నుండి అర్బన్ ఫారెస్ట్ పార్కులు కూడా ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 6 నుంచి జూ పార్కులోకి సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నట్టు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలుపారు. నగర, పట్టణ వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు, కోవిడ్ నిబంధనలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ సందర్శకులకు పార్కు ల లోపలికి అనుమతించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news