జాగింగ్ కి వెళ్ళాడు.. కోటీశ్వరుడు అయ్యాడు !

-

అతను ఒక సాదా సీదా బ్యాంకు మేనేజ‌ర్, మధ్య తరగతి కుటుంబం. ఎంత బ్యాంక్ మేనేజర్ అయినా కుటుంబ కష్టాలు తప్పేవి కాదు. కానీ రాత్రికి రాత్రి అతను అదృష్టం వరించింది., కోటీశ్వరుడు గా మారిపోయాడు. అదేంటి ఏమైనా లాటరీ వచ్చింది అనుకుంటున్నారా.అలా అనుకుంటే మాత్రం పొరబాటే. ఎందుకంటే సదరు బ్యాంక్ మేనేజర్ ఒక్క రోజులో ఎలా కోటీశ్వరుడు అయ్యాడో చూడండి.

సౌత్‌ వెస్ట్‌ అర్కాన్సాస్‌లో ఓ బ్యాంకు మేనేజ‌ర్ గా పని చేస్తున్న కెవిన్ కినార్డ్‌.. ఎప్పటిలాగే క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌ కి జాగింగ్ కి వెళ్ళాడు. అక్కడ అయ్యగారి కంటికి నదురుగా ఒక రాయి క‌నిపించింది. కాస్త మెరుస్తూ కనిపించడ‌ంతో సంచిలో వేసుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక దానిని ప‌రీక్షించి చూశాడు. అయితే దాదాపు 48ఏళ్ల చ‌రిత్రలో ల‌భించిన రెండ‌వ అరుదైన వ‌జ్రం త‌న సొంత‌మైంద‌ని తెలిసి షాకయ్యాడు. 9.07 క్యారెట్ల వజ్రం ల‌భించ‌డంతో కెవిన్ కినార్డ్ పేరు మారుమ్రోగిపోయింది. అలా లాటరీ లాంటిది ఏదీ తగలకుండానే మనోడు రాత్రికి రాత్రి అతను అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరుడు గా మారిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news