రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేసిఆర్ పిలుపు

-

రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రేపు, రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు గారు పిలుపునిచ్చారు.లోక్ సభ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. సీఎం..ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతులను మరోసారి మోసం చేయడమేనని కేసీఆర్ మండిపడ్డారు.

రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది.?” తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం తెలంగాణ రైతులను దగా చేయడమే అని మండిపడ్డారు. “ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్ళు అని అన్నారు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టిందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news