కేజ్రీవాల్‌ కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు : అమిత్ షా

-

లోక్‌సభ ఎన్నిక ల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం కోర్టులో పిటిషన్ దాఖలుచేయగా… విచారణ జరిపిన ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్ కి జూన్‌ 1 వరకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ”కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టును ధిక్కరించడమే అవుతుంది. తిహార్ జైల్లో కెమెరాల ద్వారా తన కదలికలు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుతున్నాయని కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను షా కొట్టిపారేశారు. ఆ జైలు పాలన అధికారం ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉందని ,కేజ్రీవాల్‌ కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. విద్యుత్‌ బిల్లులు మాఫీ చేస్తామని దేశమంతటికీ హామీ ఇస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తక్కువ స్థానాల్లో పోటీ చేస్తూ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేయగలరని అమిత్ షా ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news