కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒకే ఒక్క ఎంపీ సీటు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అన్నారు. 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పక్కా గెలిచే స్థానం నల్లగొండ మాత్రమేనని ఆయన అన్నారు.తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ…సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, కరీంనగర్, నాగర్ కర్నూల్,ఖమ్మం, మెదక్, చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ లో బీఆర్ఎస్ , బీజేపి మధ్య పోటీ ఉందని అన్నారు.
ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం నామా నాగేశ్వరరావు గెలిపించుకుంటున్నారని ,తాను ప్రత్యేకంగా సర్వే చేయించానని.. సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా సర్వే రిపోర్ట్ చెప్తోందన్నారు కేటీఆర్. కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందన్నారు కేటీఆర్ .. కాంగ్రెస్ , బీజేపీ లకి భయం పట్టుకుందని తెలిపారు. సిరిసిల్లలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదని కేటీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం చూపిస్తుందని అనుకోవడం తాను అనుకోవడం లేదన్నారు కేటీఆర్.