పొన్నాలకే దక్కిన జనగామ సీటు…

-

మహాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ విషయంలో ఏర్పడిన సందిగ్థతకు శుక్రవారం అర్థరాత్రి తెరపడింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పొన్నాలే..బరిలోకి దిగుతారని  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్చ్ కుంతియా స్పష్టం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు ప్రొఫెసర్ కోదండరాంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. కోదండరాం పెద్ద మనుసు చేసుకుని ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు త్యాగం చేశారని కుంతియా తెలిపారు.

ప్రజాకూటమికి ప్రొఫెసర్ కోదండరాం కన్వీనర్ గా వ్యవహరిస్తారని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ప్రచారానికి సోనియా, రాహుల్ కూడా వస్తారన్నారు. ఈ సందర్భంగా మహాకూటమికి పీపుల్స్‌ ఫ్రంట్‌గా నామకరణం చేశారు. పీపుల్స్‌ ఫ్రంట్‌ ప్రకటన తీర్మానానికి ఉద్యమ ఆకాంక్షల అజెండాను జతచేశారు. రాహుల్, కుంతియాలతో జరిగిన వరుస భేటీలతో కోదండరాం వెనక్కి తగ్గి పొన్నాలకు ఓకే అన్నారు. తెరాసను ఓడించడమే తమ ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను చైతన్యం వంతం చేస్తామని వారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news