ప్రభుత్వం పరువును కాపాడుకోవాలి… ఉండవల్లి

-

ఏపీలో సీబీఐకి నోఎంట్రీ చెబుతూ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో చిత్తు కాగితంతో సమానమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై శుక్రవారం మీడియా ఉండవల్లి అభిప్రాయం కోరగా…ఆయన మాట్లాడుతూ… కోర్టు ఆదేశిస్తే సీబీఐని ఎవ్వరూ ఆపలేరన్నారు. సీబీఐ పై చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసమే అన్నట్లుగా ఉందని ఆయన తెలిపారు. సీబీఐ పై జారీ చేసిన జీవోను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుని ప్రభుత్వం పరువును కాపాడుకోవాలని ఉండవల్లి సలహా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల్లో జరుగుతున్న అవినీతిపై సీబీఐ  విచారణ నేరుగా చేపడుతుందని చెప్పారు.

సీబీఐ తనంతట తానుగా ఏ రాష్ట్రంలోకీ రావడానికి ఆస్కారంలేదు… రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే సీబీఐ వస్తుందన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్‌ ఎక్విజేషన్‌ మీద సీబీఐ ఎంక్వైరీని అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే కోరిందన్నారు. రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తోందని సర్వత్రా చర్చనీయాంశమైన సందర్భంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news