ఆ రీమేక్ లో అల్లు అర్జున్..?

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత ఏ సినిమా చేస్తాడు అన్న దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రంతో సినిమా అనుకున్నా అరవింద సమేత కోసం డే అండ్ నైట్ కష్టపడిన త్రివిక్రం కొంత గ్యాప్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. త్రివిక్రం సినిమా ఉంటుంది కాని కొద్దిగా టైం పడుతుందని టాక్. ఇక ఈలోగా ఈమధ్య కోలీవుడ్ లో రిలీజై సూపర్ హిట్ అయిన 96 మూవీ రీమేక్ గా దిల్ రాజు బన్ని ముందు ప్రపోజల్ పెట్టాడట.

ఆ సినిమా చూసిన బన్ని నచ్చిందని చెప్పినా తన ఇమేజ్ కు ఈ కథ ఎంతవరకు కరెక్ట్ అవుతుందనే ఆలోచనలో పడ్డాడట. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 మూవీ ఓ క్రేజీ లవ్ స్టోరీ. అందులో విజయ్ సేతుపతి నటన అదిరిపోతుంది. అయితే సినిమాలో బన్ని విజయ్ ను మరిపించేలా చేస్తాడా లేదా అన్నదే డౌట్. కచ్చితంగా అల్లు అర్జున్ ఈ రీమేక్ చేస్తే సాహసం చేస్తున్నట్టే లెక్క అంటున్నారు.

బన్ని రిస్క్ చేసి 96 సినిమా చేస్తాడా లేక ఎందుకొచ్చిన గొడవని సినిమా వదులుకుంటాడా అన్నది వేచి చూడాలి. సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news