కరోనా కారణంగా ఐపీఎల్ ఆలస్యంగా మొదలైంది. మైదానంలో ప్రేక్షకుల్లేరు. ఆట పూర్తయ్యాక క్రికెటర్లని ప్రశ్నించడానికి మీడియా లేదు. ప్రస్తుతం ఆటగాళ్ళు అక్కడ ఆడుతున్నారు. ప్రేక్షకులు టీవీల్లో చూస్తున్నారు. కరోనా లేకపోతే కథంతా వేరుగా ఉండేది. ఐతే కరోనా కారణంగా క్రికెట్ లో చాలా మార్పులొచ్చాయి. మొదటగా కోవిడ్ నిబంధనల్లో బంతికి లాలాజలం అంటించరాదని ఐసీసీ ప్రకటించింది.
కోవిడ్ విజృంభిస్తున్న కారణంగా క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతిని మరింతగా షైన్ చేయడానికి లాలాజలం అంటించకూడదని తెలిపింది. కానీ గత రాత్రి జరిగిన రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచులో ఈ నిబంధనని రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ రాబిన్ ఉతప్ప ఉల్లంఘించాడు. మూడవ ఓవర్లో ఐదవ బంతికి రాబిన్ ఉతప్ప లాలజలం అంటిస్తూ కనిపించాడు. ఐతే ఈ విషయమై ఐపీఎల్ బృందం ఇప్పటి వరకు స్పందించలేదు. మరి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందున వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.