నిన్న రాహుల్‌ గాంధీ, నేడు తృణముల్ ఎంపీ ఓబ్రెయిన్‌ !

-

నిన్న హాత్రాస్ పూర్ రేప్ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీని కింద పడేశారు పోలీసులు.

a

వెంటనే తేరుకున్న రాహుల్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపారు. అయినా తగ్గకుండా ముందుకు వెళుతుండగా రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈరోజు కూడా హత్రాస్ పూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేతలను కట్టడి చేసేందుకు దారుణంగా ప్రవర్తిస్తున్నారు యూపీ పోలీసులు. నిన్న రాహుల్‌ గాంధీని కింద పడేసిన ఖాకీలు.. నేడు తృణముల్ ఎంపీ ఓబ్రెయిన్‌పై కూడా జులుమ్ ప్రదర్శించారు. ఆయన్ని కూడా కింద పడేశారు పోలీసులు. దీంతో యూపీ పోలీసుల మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news