కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఇప్పటికీ ఆపడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కేంద్రంలో మోడీ సర్కార్ ని రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ ను ఉద్దేశిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మోడీ కేసీఆర్ లు రైతులను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు అంటూ విమర్శలు గుప్పించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
వ్యవసాయ బిల్లు పేరుతో నరేంద్ర మోదీ రైతులందరికీ అన్యాయం చేసేందుకు సిద్ధం అయితే… తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి అంటూ విమర్శించారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపకుండా మీడియా నోరు నొక్కేసి … ప్రజా వ్యవస్థను నాశనం చేశారు అంటూ మండిపడ్డారు. కేవలం కార్పొరేట్ వ్యాపారులకు మేలు చేసేందుకు వ్యవసాయ బిల్లు తీసుకువచ్చారు అని విమర్శించిన ఉత్తంకుమార్ రెడ్డి.. వ్యవసాయ బిల్లుతో రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది అంటూ విమర్శించారు. ఇక దుబ్బాక ఎన్నికల్లో గెలిచి తీరుతాను ఆశా భావం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.