జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చేతికొచ్చిన కందిపంటను తొలగించి తమ భూమిని కబ్జా చేశారని రైతులు ఆందోళనకు దిగారు. లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన రైతులు పురుగుల మందు డబ్బాతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ముందు నినాదాలు చేశారు రైతులు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రైతుల వద్ద నుంచి పురుగుల మందు డబ్బాలు తీసుకున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఇక మరో పక్క జనగామ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద పొన్నాల లక్ష్మయ్య వర్గం జంగా రాఘవరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరినొకరు తిట్టుకున్నారు. అంతే కాక అంతటితో ఆగకుండా ఒకరి మీద మరొకరు దాడి చేసుకు నేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేసి ఆ ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపించేశారు.