“సబ్బం హరి”కి కబ్జాలు కొత్తేమీకాదన్న “టీడీపీ నేతలు”!

-

విశాఖలో టీడీపీనేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తనకు ముందుగా నోటీసులు ఇవ్వలేదని హరి వాదిస్తుంటే… గోడకు అంటిచింన వాటిని నోటీసులు అనే అంటారని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి మళ్లీ ఎదురుప్రశ్నలు వేస్తున్నారేంటి.. కబ్జాచేసినప్పుడు తెలియదా, చూస్తూ ఊరుకోవాలా అని వైకాపా నేతలు చెబుతున్నారు! ఇక్కడ నేడు హడావిడి చేస్తున్న టీడీపీ నేతలే గతంలో హరి కాంగ్రెస్ లో ఉండగా… కబ్జాలపై ధర్నాలు చేశారు!

అవును… ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తనపై అధికారులు, ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చెప్పుకొస్తున్నారు సబ్బం హరి! మరి హరి ప్రభుత్వానికి వయ్తిరేకంగా చేసిన పోరాటాలేంఇటో ఆయనకే తెలియాలి. టీవీ డిబేట్లలో పోరాటాలైతే చాలానే చేశారు! పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి.. ఆ స్థాలాన్ని అధికారులు రికవరీ చేస్తుంటే.. కక్ష సాధింపు అని అనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో సబ్బం హరి & టీడీపీ నేతలే చెప్పాలి!

ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే… సబ్బం హరి కబ్జాలపై నాడు వామపషాలతో కలిసి టీడీపీ నేతలు ధర్నాలు చేశారు! ఇదే క్రమంలో… గతంలో విశాఖ జిల్లాపరిషత్ మీటింగ్ లో.. సబ్బం హరి భూకబ్జాను అయ్యన్నపాత్రుడు గట్టిగా నిలదీశారు కూడా! మరి ఆ విషయాలు టీడీపీ నేతలకు గుర్తులేదా.. వారికి కూడా అల్జీమర్ వ్యాది వచ్చిందా.. సబ్బం హరిని టీడీపీ నేతలు గతంలో కబ్జాకోరు గా గుర్తించి పోరాడిన సంగతి ఆయనకు గుర్తు లేదా?

పగటి పూటా తొలగింపు ప్రక్రియలు చేపడితే ప్రజలకు ఇబ్బంది… పైగా నలుగురు జనాలనేసుకొచ్చి రచ్చ చేస్తారనే ఉద్దేశ్యంతో.. ప్రజా జీవితానికి ఆటంకం కలగకుండా తెల్లవారు జామున తొలగించి ఉండొచ్చు! ఆక్రమించారా లేదా.. ఆక్రమించడం తప్పా కాదా.. అది చెప్పకుండా… తెల్లారుజామున వచ్చారు.. ముహూర్తం చూడకుండా వచ్చారు.. రాహుకాలంలో కూల్చారు వంటి కబుర్లు విషయాన్ని తప్పుదోవపట్టించడానికే అని ఈ సందర్భంగా పలువురు విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news