కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో 18 పరుగులతో ఘన విజయం సాధించింది ఢిల్లీ డేర్ వెవిల్స్. దీంతో పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ఢిల్లీ. షార్జా వేదికపై బౌండరీలు చాలా చిన్నవని…ప్రత్యర్ధి ముందు ఎంత భారీ లక్ష్యం ఉంచినా మనకు విజయావకాశాలు తక్కువే అన్నారు ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. షార్జా పిచ్ పై మొదట బ్యాటింగ్ చేసి విజయం సాధించడం చాలా కష్టమని…కానీ బౌలర్ల ప్రదర్శనతో అద్భుతం సాధించామన్నారు శ్రేయస్. షార్జాలో నమోదైన గెలుపుతో జట్టులో ఉత్సాహం రెట్టింపైందన్నారు.
ఢిల్లీ జట్టు ఇప్పటి వరకు సాధించిన విజయాల్లో చాలా వరకు ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లే ఎక్కువ. నిన్న షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ కూడా చివరి వరకు హోరాహోరీగా సాగింది. ఒత్తిడిలోనూ తమ జట్టు ఆటగాళ్లు రాణిస్తుండడం శుభపరిణామమని తెలిపారు ఢిల్లీ కెప్టెన్. ఇదే ఆటతీరుదను వచ్చే మ్యాచులలోనూ కొనసాగిస్తామన్న నమ్మకం ఉందన్నారు.