గూగుల్ కు పోటీగా మినీ యాప్ స్టోర్‌ను లాంచ్ చేసిన పేటీఎం

-

ప్ర‌ముఖ డిజిట‌ల్ వాలెట్ యాప్ పేటీఎం సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన ప్లే స్టోర్‌కు పోటీగా మినీ యాప్ స్టోర్‌ను లాంచ్ చేసింది. ఇందులో యాప్స్ యూజ‌ర్ల‌కు ఇప్ప‌టికే అందుబాటులో ఉన్నాయి. ఈ మినీ యాప్ స్టోర్ వ‌ల్ల ప్ర‌త్యేకంగా ఆ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన ప‌ని ఉండ‌దు. వాటిని పేటీఎం నుంచే వాడుకోవ‌చ్చు. దీంతో ఫోన్‌లో స్పేస్ ఆదా అవుతుంది. అలాగే వేగంగా చెల్లింపులు జ‌ర‌ప‌వ‌చ్చు.

paytm mini app store launched

ఇక పేటీఎం మినీ యాప్ స్టోర్‌ను పేటీఎం యాప్‌లో ప్ర‌స్తుతం యూజ‌ర్లు యాక్సెస్ చేయ‌వ‌చ్చు. ఇందులో డెక‌థ్లాన్‌, ఓలా, పార్క్ ప్ల‌స్‌, ర్యాపిడో, నెట్‌మెడ్స్‌, 1 ఎంజీ, డామినోస్ పిజ్జా, ఫ్రెష్ మెనూ, నో బ్రోక‌ర్ త‌దిత‌ర యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పేటీఎం వాలెట్‌, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌, యూపీఐతోపాటు నెట్ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌తో చెల్లింపులు జ‌ర‌ప‌వ‌చ్చు.

కాగా మినీ యాప్ స్టోర్‌ను లాంచ్ చేసిన సంద‌ర్బంగా పేటీఎం ఫౌండ‌ర్‌, సీఈవో విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ మాట్లాడుతూ ఇండియ‌న్ యాప్ డెవ‌ల‌ప‌ర్ల‌కు పేటీఎంలోని మినీ యాప్ స్టోర్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. దీని వ‌ల్ల వారు పేటీఎం చెల్లింపుల‌ను మ‌రింత సుల‌భంగా ఉప‌యోగించుకునేందుకు వీలుంటుంద‌ని అన్నారు. అలాగే పేటీఎం యూజ‌ర్లు ఇందుకు ప్ర‌త్యేకంగా ఇత‌ర యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకునే ప‌ని ఉండ‌ద‌ని, వేగంగా చెల్లింపులు కూడా జ‌ర‌ప‌వ‌చ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news