కరోనా సమయంలో డబ్బులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎల్ ఆర్ ఎస్ కట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫీజు లేకుండానే ఎల్ ఆర్ ఎస్ చేస్తుందని పేర్కొన్నారు. ఖజానా నింపుకోవడం కాళేశ్వరం పేరిట ఖాళీ చేసే బ్రతుకు దెరువు పని చేస్తోంది ప్రభుత్వం అని విమర్శించారు. కష్ట పడి అప్పుల పాలై ప్రజలెవరూ ఎల్ ఆర్ ఎస్ కట్టకండని ఆయన సూచించారు.
టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా దించాలి ఆస్తులు ఎలా కాపాడు కోవాలో ఆలోచించండని సూచించారు. ఈ ఆలోచన ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చిందని, పైసా పైసా కూడా పెట్టి ప్లాట్ కొన్న పేదవారి కొంపలు ముంచుతున్నారు కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ చేసే సర్వే లు ఏవి సంస్కరణల కోసం కాదని ఆయన అన్నారు. రైతుబందు పేరుతో ఐదు వేలు ఇచ్చి వెనుక నుంచి లక్ష రూపాయలు కొట్టేస్తున్నారని విమర్శించారు. టీఎన్జీవోలు ఎన్నికలొస్తే టిఆర్ఎస్ కోసం మందు బాటిళ్లు పంచుతున్నారని ఆరోపించారు.