రియాకు షాకిచ్చిన ముంబై కోర్టు!

-

సుశాంత్ మృతి త‌రువాత డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది రియా చ‌క్ర‌వ‌ర్తి. డ్ర‌గ్స్‌తో ఆమెకు సంబంధాలున్నాయ‌ని, ఈ కేసుకి డ్ర‌గ్స్‌కి సంబంధం వుంద‌న్న కోణంలో విచార‌ణ చేప‌ట్టిన ఎన్సీబీ అధికారులు రియాని అదుపులోకి తీసుకున్న‌విష‌యం తెలిసిందే. మూడు రోజుల విచార‌ణ త‌రువాత రియాని అదుపులోకి తీసుకున్నారు.


విచార‌ణ‌లో వ‌రుస‌గా డ్ర‌గ్స్ సంబంధాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో ఆమెని జ్యుడిషియ‌ల్ కస్ట‌డీకి త‌ర‌లించారు. ఈ మంగ‌ళ‌వారంతో రియా జ్యుడిషియ‌ల్ కస్ట‌డీ ముగుస్తున్న నేప‌థ్యంలో ముంబై కోర్టు రియాకు దిమ్మ‌దిరిగే షాకిచ్చింది. ఈ రోజు త‌న‌కు బెయిల్ ఇస్తుంద‌ని భావించిన రియా క‌స్ట‌డీని ఈ నెల 20 వ‌ర‌కు పొడిగిస్తూ తీర్పు చెప్పింది. నెల రోజుల క్రితం  రియా ఆమె సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా ముంబై కోర్టు కూడా బెయిల్ నిరాక‌రించి అక్టోబ‌ర్ 20 వ‌ర‌కు రిమాండ్ విధించ‌డంతో రియా షాక్‌కు గుర‌వుతోంద‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news