నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన ముందస్తు ఎన్నికల పనులలో ఎలక్షన్ కమిషన్ అలానే సిబ్బంది అందరూ నిమగ్నమయ్యారని పేర్కొన్నారు.
ఫిబ్రవరి మొదటి వారం లో జీ హెచ్ ఎం సి టర్మ్ ముగుస్తుందని నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిపేలా ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేస్తామని వెల్లడించారు ఆయన. అలానే ఇప్పటికే కమిషన్ పలు రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని సేకరించగా అందరూ బ్యాలెట్ బాక్స్ ల ద్వారానే ఎన్నికలు జరపాలని కోరారని అందుకే బ్యాలెట్ ద్వారానే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.