చాటింగ్ చేస్తున్నారని వార్నింగ్ ఇస్తే ఇంట్లో నుంచి జంప్…!

-

హయత్ నగర్ లో ఒక ఇంటర్ విద్యార్ధి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ తట్టి అన్నారంలో నివాసముండే ఇంటర్ విద్యార్థిని కుంలారా మిస్సింగ్ కలకలం సృష్టించింది. అర్థరాత్రి 12:45 నిమిషాలకు ఇంట్లో గొడవ పడి బయటికి వెళ్ళాడు లారా. తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. లారా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు తండ్రి రవి కుమార్.

అర్ధరాత్రి సోషల్ మీడియా లో చాటింగ్ చేస్తుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. మౌంట్ లీటర జీ  లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి లారా ఆచూకీ కోసం గాలిస్తున్నారు హయత్ నగర్ పోలీసులు. సరౌండింగ్ లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news