ఢిల్లీకి స్ట్రాంగ్ వార్నింగ్… ఎందుకంటే…!

-

రాబోయే శీతాకాలం, మరియు పండగ రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రోజుకు 15,000 కరోనా కేసులు నమోదు కావొచ్చు అని… నేషనల్ కంట్రోల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) తయారుచేసిన ఒక నివేదిక హెచ్చరించింది. ఆరోగ్య సంరక్షణ సేవల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తన హెచ్చరికల్లో స్పష్టం చేసింది.

మూడు అంశాలను హైలెట్ చేస్తూ ఒక నివేదిక విడుదల చేసింది. శ్వాసకోశ వ్యాధులను తీవ్రంగా చేసే చలికాలం, ఢిల్లీకి బయటి నుంచి రోగులు అధిక సంఖ్యలో రావచ్చు, ఎక్కువ రోగాలతో బాధ పడే రోగులు ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది అని హెచ్చరించారు. దానికి తోడు పండగ ఉండటంతో కరోనా కేసులు వేగంగా పెరగవచ్చు అని హెచ్చరించారు. నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) చైర్మన్ డాక్టర్ వికె పాల్ పర్యవేక్షణలో ఎన్‌సిడిసి ఈ నివేదికను రూపొందించింది.

Read more RELATED
Recommended to you

Latest news