ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించారు. వసంత్ విహార్ లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర గృహ నిర్మాణ శాఖ కేటాయించింది. కార్యాలయం నిర్మాణం కోసం రెండు 550 చదరపు మీటర్ల బ్లాక్ లు కేటాయించింది. ఇప్పటికే పార్టీ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ఎంపీలు, పార్టీ నేతలు పరిశీలించారు కూడా.
త్వరలో కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్టు చెబుతున్నారు. పార్లమెంట్ ఉభయ సభలల్లో కనీసం 7 గురు సభ్యులు ఉంటే పార్టీ కార్యాలయం నిర్మాణానికి దేశరాజధాని ఢిల్లీలో స్థలం కేటాయిస్తారు. ఉభయ సభలల్లో టిఆర్ఎస్ పార్టీకి 16 మంది ఎంపీలు ఉండడంతో టీఆరెస్ కు స్థలం కేటాయించారు. సాధారణంగా 16 మంది ఎంపీలు ఉన్న పార్టీలకు 1000 చదరపు అడుగుల స్థలం కేంద్ర గృహ నిర్మాణ శాఖ కేటాయిస్తుంది. అలానే టీఆరెస్ కు కూడా కేటాయించింది.