ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఓ వినియోగదారుడికి క్షమాపణలు చెప్పింది. ”ఫ్లిప్‌కార్ట్ సర్వీస్‌లు మా రాష్ట్రంలో అందుబాటులో ఎందుకు లేవు, అన్ని రాష్ట్రాలను మీరు ఒకేలా చూడండి..” అని నాగాలాండ్‌కు చెందిన సింగర్ అలోబో నాగా ఫ్లిప్‌కార్ట్ ను సోషల్ మీడియాలో కోరాడు. అయితే అందుకు ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
”క్షమించండి, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయాలని ఆసక్తి చూపించినందుకు ధన్యవాదాలు, కానీ మా విక్రయదారులు ఇండియా బయట తమ సేవలను అందించలేరు..” అని ఫ్లిప్‌కార్ట్ అలోబో నాగాకు సోషల్ మీడియాలో సమాధానం ఇచ్చింది. నాగాలాండ్ నిజానికి ఇండియాలోనే ఉంది. కానీ ఆ సమాధానం ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఎవరో తెలియదు కానీ.. నాగాలాండ్ అంటే.. అదొక దేశమని భావించారు. అందుకనే అక్కడ తమ వస్తువులను విక్రయించడం లేదని, ఫ్లిప్‌కార్ట్ సేవలు అక్కడ అందుబాటులో లేవని ఫ్లిప్‌కార్ట్ నుంచి సమాధానం వచ్చింది. ఇక ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన రిప్లైని అలోబో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌పై నెటిజన్లు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
To those who were questioning me ! Here is the @Flipkart reply ! Don’t shoot the messenger 💪 Nagaland and NE is India even if your heart may not think so pic.twitter.com/qocNMXqH3N
— Pradyot_Tripura (@PradyotManikya) October 8, 2020
అయితే ఫ్లిప్‌కార్ట్ తాను చేసిన తప్పిదంపై స్పందించింది. ఇలా జరిగినందుకు తీవ్రంగా విచారిస్తున్నామని, అదేదో సాంకేతికంగా జరిగిన పొరపాటు అయి ఉంటుందని, అందువల్ల తమను క్షమించాలని, నాగాలాండ్‌లోనూ ఫ్లిప్‌కార్ట్ సేవలు అందిస్తుందని ఆ సంస్థ రిప్లై ఇచ్చింది. అయినప్పటికీ ఫ్లిప్‌కార్ట్ చేసింది ఘోర తప్పిదమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు తగిన విధంగా వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.