అమ్మాయి కోసం కక్కుర్తి పడ్డ డాక్టర్.. 42 లక్షలు మంగళం

-

ఆన్ లైన్ లో స్నేహాలు, ఆన్ లైన్ లో అమ్మాయిలు అంటూ ఎన్ని మోసాలు జరుగుతున్నా జనం జాగ్రత్త పడడం లేదు. మనిషి ఎదురుగా ఉంటేనే నమ్మలేని ఈరోజుల్లో కూడా ఆన్ లైన్ లో ఎవరో చెప్పిన మాటలు విని కొందరు భారీగా నష్టపోతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన పోలీసులని ఆశ్రయిస్తున్నారు. తాజాగా డేటింగ్ యాప్ పేరుతో హైదరాబాద్ కి చెందిన ఒక డాక్టర్ మోస పోయారు.

తాజాగా అమ్మాయిల కోసం డేటింగ్ యాప్ లో హైదరాబాద్ కి చెందిన ఓ డాక్టర్ వెదికారు. అందులో మనోడికి ఒక అమ్మాయి బాగా నచ్చింది. ఆమెతో డేట్ చేయాలని అనుకున్నాడు. తనకు నచ్చిన అమ్మాయి కోసం సైబర్ చీటర్స్ చెప్పిన అకౌంట్ లోకి దశల వారీగా 42 లక్షల రూపాయలు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు ఆ డాక్టర్. డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసిన అనంతరం వారు స్పందించకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న డాక్టర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news