చిగురించిన ప్రేమ.. చిదిమేసిన పేరెంట్స్..?

-

ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ముఖ్యంగా పరువు హత్యలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి అనే విషయం తెలిసిందే. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిని ప్రేమించడమే యువకుడికి శాపంగా మారి పోయింది. చివరికి యువతి కుటుంబ సభ్యులు దారుణంగా దాడి చేయడంతో చివరకు యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఢిల్లీ లోని ఆదర్శనగరంలో వెలుగులోకి వచ్చింది.

ఆదర్శ్ నగర్ కు చెందిన రాహుల్ రాజ్ పుత్ అనే యువకుడు చదువుకుంటూనే మరోవైపు ఇంటి దగ్గర పిల్లలకు ఇంగ్లీషు ట్యూషన్ చెబుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇటీవలే రాహుల్ ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టారు. ఈ విషయం ఓ రోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలియడంతో రాహుల్ ని హెచ్చరించారు. కులాలు వేరు కావడంతో ఇద్దరీ ప్రేమని అంగీకరించలేదు పెద్దలు. అయితే సదరు యువతి మాత్రం రాహుల్ కి తరచూ ఫోన్ చేస్తూనే ఉండేది కుటుంబ సభ్యులు హెచ్చరించిన తీరు మార్చుకోలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన యువతి కుటుంబ సభ్యులు రాహుల్ ని బయటకు తీసుకెళ్లి దారుణంగా దాడి చేసి గాయపరిచారు. దీంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు యువకుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news