టీటీడీ నూతన ఈవోగా ఐఏయస్ అధికారి డా​క్టర్‌ జవహర్‌ రెడ్డి

-

తిరుపతి తిరుమల దేవస్థానానికి కొత్తగా ఈవోగా ఐఏయస్ అధికారి డా​క్టర్‌ జవహర్‌ రెడ్డి శనివారం భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను మనతో పంచుకున్నారు. తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని, ఎంతో పుణ్యం చేస్తే గానీ ఇంతటి భాగ్యం దక్కదని పేర్కొన్నారు.నా చదువు మొత్తం శ్రీవారి పాదాల చెంతనే పూర్తి చేశాను.శ్రీవారి భక్తులు తిరుమలకు రావడానికి ఎటువంటి అసౌకర్యాలు ఉండకుండా ప్రస్తుత్తం ఉన్న పద్దతులను మరింత పటిష్టం చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో భక్తుల కోసం ఇంకా సులువైన కొత్త పద్ధతులు తీసుకొస్తానని తెలిపారు.

అలాగే కరోనా కష్ట కాలంలో అందరు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పూర్తి జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తే కరోనా వ్యాప్తి అరికట్టవచ్చన్నారు.అలాగే అన్‌లాక్‌ 5లో భాగంగా కొన్ని మినహాయింపులు ఇచ్చారని.తెలిపారు. ఇంకా టిటిడి ఉన్నత అధికారులతో శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించి తగిన సూచనలు తెలియజేస్తామని ఈవో కే.ఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.అలాగే నాకిచ్చిన ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news