నైట్ ఫీవ‌ర్ రావాల్సిందే అంటోంది!

-

ఒ ప‌క్క క‌రోనా విళ‌య‌తాండ‌వం సృష్టిస్తుంటే దీని ధాటికి అంతా బెంబేలెత్తిపోతున్నారు. ఒక విధ‌మైన భ‌యాన‌క వాతావ‌ర‌ణంలోకి వెళ్లిపోయారు. అయితే క్రేజీ హీరోయిన్‌లు మాత్రం అవేవీ ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ నెటిజ‌న్‌ల‌కు ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ రేసులో ముందు వ‌రుస‌లో నిలుస్తోంది అదాశ‌ర్మ‌. లాక్‌డౌన్ నుంచి చిత్ర విచిత్ర‌మైన వ‌ర్క‌వుట్లు చేస్తూ నిత్యం వీడియోల‌తో ఫోటోల‌తో ఆక‌ట్టుకున్న అదాశ‌ర్మ తాజాగా పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా అందాల ఆరబోస్తూ ఇంట‌ర్నెట్‌ని హీటెక్కిస్తున్న అదా శ‌నివారం పింక్ క‌ల‌ర్ హాఫ్ బికినీ ధ‌రించి దానికి ఓ క్యాప్ష‌న్ ఇచ్చింది. త‌ను షేర్ చేసిన ఫొటోలో అందాలు ఆర‌బోసిన అదా సాటర్‌డే నైట్ ఫీవ‌ర్ రావాల్సిందే అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. దీంతో ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

విక్ర‌మ్‌భ‌ట్ డైరెక్ట్ చేసిన  `1920` హార‌ర్ థ్రిల్ల‌ర్ తో ఎంట్రీ ఇచ్చిన అదా తాజాగా మ‌రో హార‌ర్ చిత్రాన్ని అంగీక‌రించింద‌ట‌. #100yearsofAdahSharma #1920to2020 అంటూ ఇన్‌స్టా వేదిక‌గా చ‌మ‌త్క‌రిస్తూ షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఓ హార‌ర్ చిత్రాన్ని అంగీక‌రించాన‌ని, ఆ ఆనందంలో ఈ వీడియోని మీతో పంచుకుంటున్నానని క్లారిటీ ఇచ్చింది. చాలా మంది నన్ను హర్రర్ మూవీ లో న‌టించ‌డాన్ని చూడాలనుకుంటున్నారు … ఒక చిత్రంలో నేను హర్రర్ చేయడం మీరు చూడగలిగేంత వరకు … నా యూట్యూబ్ ఛానెల్‌లో నా వీడియోలు చూడండి. చూసి ఆనందించండి` అని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news