నెల్లూరులో ఇద్దరు మహిళల దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా!

-

నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది..నవలాకులతోటలో ఇద్దరు మహిళల అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు..భార్య ప్రశాంతి,సమీప బంధువు వెంకటరత్నమ్మను హత్యచేశాడు నాగేశ్వర రావు అనే వ్యక్తి..కుటుంబ కలహాలతో అర్థరాత్రి కత్తులతో విచక్షణా రహితంగా మహిళలపై దాడి చేశాడు..24గంటల వ్యవధిలో ఇద్దరిని హతమార్చి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు..భార్యకు వివాహేతర సంబంధం ఉందని..అందుకు సమీప బంధువు వెంకటరత్నమ్మ సహకరిస్తుందని అనుమానంతో అర్థరాత్రి వారిద్దరిని హత్య చేశాడు నాగేశ్వర రావు..భార్య తలను వంటింట్లో పెట్టాడు. నిందితుడు నాగేశ్వర రావుకు ఇది మూడవ వివాహం..మొదటి భార్యకు గతంలోనే విడాకులు ఇచ్చాడు.రెండవ భార్య చనిపోయింది. ఇక మూడవ భార్యను అత్యంత క్రూరంగా హత్యచేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news