ఏపీలో జగన్ సర్కార్ ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా.. అది ఒకప్పుడు టీడీపీ ప్రవేశపెట్టిన పథకమే అని, ఇది చంద్రబాబు మస్తిస్కంలో ఎప్పుడో పుట్టిందని, దాన్నే జగన్ కాపీకొట్టి పేరుమార్చారని చెప్పుకొస్తున్నారు టీడీపీ నేతలు! అంటే… పరోక్షంగా అది గొప్పపథకమే అని, దానివల్ల అటు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని, ఇటు ప్రభుత్వానికి మంచి పేరొస్తుందనే విషయం వారి విమర్శల్లోనే తేటతెల్లమవుతుందని అర్ధమవుతుంది! తాజాగా ఇదే విషయాలపై స్పందించారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్!
అవును… “జగన్ స్టిక్కర్ సీఎం కాదు.. స్ట్రైకింగ్ సీఎం” అని మొదలుపెట్టిన సురేష్… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “జగనన్న విద్యాకానుక” లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని.. జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకానికి సంబంధించి మిగిలిన రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయని.. ఈ పథకంవల్ల 43 లక్షల మంది విద్యార్ధులు లబ్ది పొందుతున్నారని పేర్కొన్నారు!
జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలు సరైనవి కానిపక్షంలో.. ప్రజలకు ప్రయోజనకరం కాని పక్షంలో.. వాటిపై తీవ్రంగా విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు పుష్కలంగా ఉంటుంది.. ఆ లెక్క వేరు! కానీ ఇక్కడ ఏపీలో ప్రతిపక్షాల విమర్శలన్నీ… పథకాలు బాగాలేవని కానీ, వాటివల్ల ప్రయోజనం లేదు అని కానీ చెప్పలేని పరిస్థితి! ఎందుకంటే ఆ పథకాలన్నీ ప్రజా ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా.. ప్రజామోదంగా కూడా ఉంటున్నాయి! దీంతో… అవి తమ పథకాలే అని, అవన్నీ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడో అమలుచేసిందని చెప్పుకొస్తున్నారు వైకాపా నేతలు!!
-CH Raja