కాలం ఎంత అభివృద్ది చెందుతున్నా సరే కొంత మంది మనుషులు మాత్రం ఇంకా మూడ నమ్మకాలనే బలంగా నమ్ముతున్నారనడానికి ఈ వార్త ఉదాహరణ అని చెప్పవచ్చు. టెక్నాలజీ సహా అనేక రంగాలలో దూసుకుపోతున్న ఈ రాకెట్ యుగంలో ఇంకా ఇలాంటి మూడనమ్మకాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో బిబిపేటలో ఇవాళ ఊరిలోని జనం అంతా ఖాళీ చేసేశారు.
కరోనా నేపథ్యంలో ఇవాళ అందరూ ఊరు విడిచి, బయట ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా నియంత్రణ రావాలనే ఉద్దేశ్యం తో ఊరు నుంచి బయటకు వెళుతున్నామని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. మళ్లీ సాయంత్రం తిరిగి ఊళ్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అలా వెళ్లేందుకు ఈ ఊర్లోని వారంతా మాస్కులు కూడా పెట్టుకోకుండా గుంపులు గుంపులుగా వెళ్ళడం విమర్శలకి దారి తీస్తోంది.