నెట్ బ్యాంకింగ్ అమలులోకి వచ్చిన తర్వాత యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్-UPI ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా సులభం అయ్యింది. ఇక మీరు ఎస్బీఐ అకౌంట్ వాడుతున్నారా. అయితే యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపుతూ ఉంటారా.. ఎవరికైనా డబ్బులు పంపాలంటే యూపీఐని మించిన వేగవంతమైన ట్రాన్సాక్షన్ వేరే ఏదీ లేదు. ఒకవేళ మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే యోనో లైట్ ఎస్‌బీఐ యూపీఐ యాప్ ఉపయోగించండి. ఈ పద్ధతి ద్వారా వేగంగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
ఇక ఒక ట్రాన్సాక్షన్ ద్వారా రూ.10,000, రోజుకు రూ.25,000 వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చునన్నారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, బిల్లులు చెల్లించడం కోసం యూపీఐ పేమెంట్ పద్ధతి ఉపయోగించడం ఇటీవల ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాదు యూపీఐ ద్వారా డబ్బులు పంపడానికి బెనిఫీషియరీ వివరాలు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే లావాదేవీల కోసం ఎక్కువగా యూపీఐ పేమెంట్‌పై ఆధారపడుతున్నారు.
అయితే మనీ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు, యూపీఐ లావాదేవీలు జరిపినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడం మామూలే ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే అందరు కస్టమర్లకు ఇలాంటి అనుభవాలు ఎదురు అవుతాయి. ఇక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా అకౌంట్‌లో డబ్బులు డెబిట్ అవుతుంటాయి కొన్ని సార్లు. ఇలాంటి సందర్భంలో కస్టమర్లు కంగారు పడటం సహజం. అంతేకాదు డబ్బులు వెనక్కి వస్తాయా లేదా.. ఎప్పుడు అకౌంట్‌లోకి వస్తాయి. అకౌంట్‌లోకి డబ్బులు రావాలంటే ఏం చేయాలి అని చాల సందేహాలు తలెత్తుతాయి. అయితే మీరు ఒకసారి పేమెంట్ ప్రారంభించిన తర్వాత క్యాన్సిల్ చేయడం సాధ్యం కాదు. నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా, సర్వర్ డౌన్ ఉన్నా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది.
అయితే మీ యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు సాధారణంగా వెంటనే రియల్ టైమ్ రివర్సల్ ద్వారా డబ్బులు వెనక్కి వస్తుంటాయి. కొన్ని గంటల్లోనే డబ్బులు అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. లేకుంటే ఒక్కటి రెండు రోజులు సమయం పట్టొచ్చు. అయినా మీ డబ్బులు వెనక్కి రాకపోతే బ్యాంకుకు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది తెలిపారు. ఇక ఎస్‌బీఐ యోనో లైట్ యాప్ యూజర్లు యాప్‌లోనే కంప్లైంట్ చేయొచ్చు. పేమెంట్ హిస్టరీలోకి వెళ్లి raise dispute పైన క్లిక్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఆ తర్వాత మీ కంప్లైంట్ స్టేటస్‌ని Dispute Status సెక్షన్‌లో చెక్ చేయొచ్చు.