తెరాస కు ఎంపీ విశ్వశ్వర్ రెడ్డి రాజీనామా…

-

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెరాస కి గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామ  చేశారు.  దీంతో గత  కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారు, దమ్ముంటే ఆపాలంటూ టీఆర్ఎస్ అధిష్ఠానానికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంత మంది తెరాస నాయకులు మాట్లాడుతూ.. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ వివరించారు. తాజా పరిణామాలతో రేవంత్ మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజాగా చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కి రాజీనామా చేసి తెరాసకు షాక్ ఇచ్చారు.

తెలంగాణలో ఎన్నికలు సమీపస్తున్న ఈ తరుణంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు, ప్రచారాలకు కొద్ది కాలంగా  దూరంగా ఉంటూ వస్తున్నారు. రేవంత్ సవాల్ ని సీరియస్ గా తీసుకున్న కేటీఆర్ విశ్వేశ్వరరెడ్డిని ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు. విశ్వేశ్వర్ రెడ్డి తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాలను బుధవారం  మీడియా సమావేశంలో వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. ఈనెల 23న సోనియా గాంధీ సమక్షంలో విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news