ఐపీఎల్‌లో మరో టఫ్‌ ఫైట్‌..ఓడితే పాయింట్స్‌ టేబుల్‌లో…!

-

ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో జట్ల స్థానాలు ఒక్క మ్యాచ్‌తోనే తలకిందులు అవుతున్నాయి. ఏ మ్యాచ్‌ ఓడినా పాయింట్స్‌ టేబుల్‌లోకి కిందకు రావడం ఖాయం. దీంతో ఇక నుంచి ప్రతి టీమ్‌కి ప్రతి మ్యాచ్‌ కీలకమే. గత మ్యాచ్‌ల్లో విక్టరీ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన బెంగళూరు, కోల్‌కతా అమీతుమీ తేల్చుకోనున్నాయ్‌. ఈ రెండు జట్లు 8 పాయింట్లతో సమానంగా ఉన్నాయ్‌. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్స్‌ టేబుల్‌లో తమ స్థానాలు మార్చుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయ్‌.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విక్టరీ కొట్టింది. ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో చెన్నైని మట్టికరిపించి మళ్లీ లయ అందుకుంది బెంగళూరు టీమ్‌. కోహ్లీ, డివిలియర్స్‌, ఫించ్‌ లాంటి వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్స్‌ ఆర్సీబీ సొంతం. కానీ వీరిలో ఇద్దరూ వైఫల్యమైనా మ్యాచ్‌లో రాణించే వారే కరువయ్యారు. కోహ్లీ గత మూడు మ్యాచ్‌ల నుంచి అదరగొడుతున్నాడు. చెన్నై మ్యాచ్‌లో 90 పరుగులు చేసి సూపర్‌ టచ్‌లోకి వచ్చాడు. ఫామ్‌లో ఉన్న కోహ్లీని ఆపకపోతే కోల్‌కతా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. స్పాట్‌

ఇక కోల్‌కతా లాస్ట్‌ ఓవర్లలో అద్భుతాలు చేసి మ్యాచ్‌ల్ని కైవసం చేసుకుంటోంది. పంజాబ్‌ మ్యాచ్‌లో 2 పరుగులతో గెలిచి ఊపిరిపీల్చుకుంది కోల్‌కతా టీమ్‌. ఈసారి కేకేఆర్‌‌ బ్యాటింగ్‌‌ లైనప్‌‌ యంగ్‌‌ అండ్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌తో బలంగా కనిపిస్తున్నది. యంగ్‌‌స్టర్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, మోర్గాన్‌, కార్తీక్‌, రస్సెల్‌ కోల్‌కతా కీ ప్లేయర్స్‌. ఈ సీజన్‌ స్టార్టింగ్‌ నుంచి విమర్శల పాలవుతున్నా కెప్టెన్‌ కార్తీక్‌.. గత మ్యాచ్‌లో సూపర్‌ హాఫ్‌ సెంచరీతో సత్తా చాటాడు. అయితే విండీస్ ఆల్‌రౌండర్‌ రస్సెల్‌ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. రస్సెల్‌ కూడా తన బ్యాట్‌కు పనిచెబితే కోల్‌కతాకు తిరుగులేదు.కోల్‌కతా బౌలింగే వారి ప్లస్‌ పాయింట్‌. ప్యాట్‌ కమిన్స్‌, నాగర్‌ కోటి, ప్రసిద్‌‌ కృష్ణలతో పేస్‌ బౌలింగ్‌ స్ట్రాంగ్‌గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news