బ్రేకింగ్ : హిజ్రా పై పెట్రోల్ పోసి నిప్పంటించిన హిజ్రాల గ్యాంగ్

-

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రా పై పెట్రోల్ పోసి మరో హిజ్రా వర్గం నిప్పంటించిన ఘటన వేలుగులోకి వచ్చింది. హిజ్రాలలో ఒక వర్గానికి మరో వర్గానిక్కీ జరిగిన గొడవలో ఓ హిజ్రా పై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎర్రగడ్డ అవంతి నగర్ కు చెందిన హరి ప్రసాద్ అలియాస్ హంస(28)కు చందానగర్ లో నివాసం ఉంటున్న కొంత మంది హిజ్రాలతో విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హైటెక్ రైల్వే స్టేషన్ సమీపంలో మాట్లాడుకుందాం అంటూ హంసకు సమాచారం అందించడం తో హంస అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో హంస పై పెట్రోల్ పోసి నిప్పంటించి కొంత మంది హిజ్రాలు పారి పోయారు. తీవ్రంగా గాయపడ్డ హిజ్రా హంసను మెరుగైన వైద్యం నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం హిజ్రా హంస ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

Read more RELATED
Recommended to you

Latest news