ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విచారణలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఆయన కేసులో విచారణ జరిగింది. ఏపీ సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులన్నీ రేపటికి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఈరోజు కూడా సీబీఐ న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా కేసులన్ని రేపటికి వాయిదా వేసారు ఇంచార్జ్ సీబీఐ న్యాయమూర్తి.
రోజు వారీగా ఆయన కేసులను విచారిస్తున్నారు. మరోవైపు… ఇతర నాయకుల అవినీతి కేసుల మీద కూడా చాలా వేగంగా విచారణ జరుగుతుంది. తెలంగాణా మంత్రులు సబితా ఇంద్ర రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు మంత్రులు విచారణలకు హాజరయ్యారు. జగన్ కేసుల్లో ప్రధానంగా నాలుగు కేసులను విచారిస్తున్నారు.