బాబు – చినబాబులకు సజ్జల సూటి ప్రశ్నలివి!

-

అమరావతి ఉద్యమం పేరిట “300 రోజులు” పేరుతో ఒక కార్యక్రమం జరగడం, దానికి టీడీపీ నేతల నుంచి కూడా సరైన స్పందన రాకపోవడం తెలిసిందే. అయితే ఈ ఉద్యమానికి మద్దతుగా అంటూ చినబాబు లోకేష్ అమరావతి ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చంద్రబాబు ఆన్ లైన్ క్లాసులు, చినబాబు ఆఫ్ లైన్ యాత్రలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని ప్రశ్నలు సందించారు!

చంద్రబాబు హయాంలో అమరావతిలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ జరిగడం వల్ల మూడు రాజధానులు అని జగన్ అనగానే బాబు బినామీల వెన్నులో వణుకు పుట్టడం వల్ల పురుడుపోసుకున్న ఉద్యమం ఇది కాదా?

ఉద్యమం అని అంటున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా మద్దతుందని చెబుతున్నారు మరి కనీసం టీడీపీ నాయకులు అయినా ఈ ఉద్యమంలోకి ఎందుకు రావడం లేదు?

హైదరాబాద్ నుంచి అమరావతి వరకూ వచ్చి.. రైతుల దగ్గరకు రాకుండా తమరు ఎక్కడ ఉన్నరు చంద్రబాబు.. మీ కొడుకును మాత్రమే ఎందుకు పంపారు?

రైతుల ఉసురు తగులుతుందనంటూ లోకేష్‌ హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు.. అసలు “పప్పు”నకు పంట ఎలా ఉంటుందో తెలుసా? తండ్రీకొడుకులిద్దరికీ ఉన్నపలంగా రైతులు గుర్తుకొచ్చారా?

మాట్లాడితే చాలు.. అమరావతి చారిత్రక ఆవశ్యకత అంటూ ఒక ఊత పదం వాడుతున్నారు. అసలు అమరావతి ఉద్యమం పాయింట్ జీరో స్థాయిలో అయినా ఉందా?

చంద్రబాబూ… నువ్వే ఆ చారిత్రక ఆవశ్యకత ఉద్యమాన్ని వదిలేశావు.. వలస పక్షుల్లా అప్పుడప్పుడు వచ్చిపోతున్నావు.. మీ పోరాటం నిజమైనదే అయితే ఎందుకు ఇక్కడే ఉండి పోరాడటం లేదు?

విధ్వంసం మాత్రమే తెలిసిన చంద్రబాబు.. నువ్వు ఏనాడైనా ప్రజల తరుపున ఉద్యమం నడిపారా? అంటూ… ప్రశ్నల వర్షం కుర్పించారు సజ్జల రామకృష్ణా రెడ్డి! మరి ఈ ప్రశ్నలకు బాబు కానీ చినబాబు కానీ స్పందిస్తారో లేదో వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news